విద్యార్థులు అందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బుచ్చయ్యపేట అదనపు ఎస్ఐ ఎన్. భాస్కరరావు కోరారు. సీతయ్యపేట జడ్పీ హైస్కూల్లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలు వాడకం వల్ల కలిగే అనర్ధాలు క్లుప్తంగా వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు డ్రగ్స్ జోలికి పోవద్దన్నారు. విద్యార్థులు అందరితో ప్రమాణం చేయించారు. నీకు కార్యక్రమంలో HM జి. విష్ణు, పాల్గొన్నారు.