గాజువాక పరిధిలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ డీసీపీ 2 తుహిన్ సిన్హా గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఈ ప్రాంతాన్ని గంజాయి రహితంగా చేయాలన్నారు. నేరాలు జరగకుండా కాపాడాలన్నారు. భూవివాదాలు లేకుండా చూడాలన్నారు. అధికంగా నేరాలు జరిగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.