కే కోటపాడు సబ్ ఇన్స్పెక్టర్ గా ధనుంజయ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సబ్బవరం ఎస్సైగా పనిచేస్తూ, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ లక్ష్మీనారాయణ రిజర్వలో ఉన్నారు. బాధ్యత స్వీకరించిన ఎస్ ఐ ధనుంజయ కు పోలీసు సిబ్బందితోపాటు, నాయకులు, అభిమానులు, అభినందనలు తెలిపారు.