మాడుగుల మండలం ఒమ్మలి గ్రామంలో కాటా వద్ద మోదకొండమ్మ అమ్మవారి పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆ గ్రామ భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.