గొలుగొండ మండలంలోని ఏఎల్ పురం, కృష్ణదేవిపేట, సిహెచ్. నాగాపురం, కొంకసింగి తదితర గ్రామాల్లో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆయా గ్రామాల్లోని షిర్డిసాయిబా ఆలయాలకు భక్తులు తరలివెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం పలు ఆలయాల్లో అన్నసమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.