తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నర్సీపట్నం నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని బీఎస్పీ అభ్యర్థి బొట్టా నాగరాజు అన్నారు. శుక్రవారం నాతవరం మండలం ఎంబీ పట్నం, శరభవరం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పాలించిన పాలకులు నిరుద్యోగ సమస్య తీర్చడంలో విఫలమయ్యా రన్నారు. దీంతో ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి పనులు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు.