అమెరికా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌ను తప్పిస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు. పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా తామే గెలవబోతున్నామని, ట్రంప్‌ను ఓడించేందుకు అందరి మద్దతు కావాలన్నారు.