ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దక్షిణ విశాఖ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. 30వ వార్డుకు చెందిన సుందరనేని, 27వ వార్డుకు చెందిన కల్లపల్లి వెంకట సీతారామరాజు, 37వ వార్డుకు చెందిన చింతపల్లి సత్యవతి, తదితరులు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు.