బాంబు దాడి.. ముగ్గురు మృతి (వీడియో)

74చూసినవారు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఖుజ్దార్ పట్టణం శివార్లలోని చోమ్రోక్ చౌక్ సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ బాంబును రోడ్డు పక్క అమర్చారు. సీనియర్ జర్నలిస్ట్ మౌలానా సిద్దిక్ మెంగల్ అక్కడికి చేరుకున్నప్పుడు ఆ బాంబును దుండగులు పేల్చారు. ఈ ఘటనలో మెంగల్‌తో సహా మరో ఇద్దరు చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పత్రికా దినోత్సవం రోజునే జర్నలిస్టును ఇలా హత్య చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్