అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.