యర్రవరం లో అంబేద్కర్ కు ఘనంగా నివాళి

544చూసినవారు
యర్రవరం లో అంబేద్కర్ కు ఘనంగా నివాళి
నాతవరం మండలం యరవరం గ్రామంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సర్పంచ్ సత్యవతి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూప కల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తిబాబు, కృష్ణమూర్తి, కుమారి, రామ ప్రసాద్, సతీష్, శివ, నూకరాజు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్