అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యాలు భద్రత కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లోకనాథం డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన రక్షణ యాత్ర సోమవారం పాయకరావుపేటలో ప్రారంభించారు. ముందుగా సీపీఎం అధినేత సీతారాం ఏచూరికి నివాళులు అర్పించి, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నినాదాలు చేశారు. పలువురు సిపిఎం నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు.