ఎన్టిపిసి 2వ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం

72చూసినవారు
ఎన్టిపిసి 2వ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం
పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ రెండవ యూనిట్ లో గురువారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 500 మెగావాట్ల సామర్ధ్యం గల ఈ యూనిట్ లో బాయిలర్ ట్యూబులకు లీకేజీలు ఏర్పడడంతో అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. మరమత్తు పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ ఉత్పత్తిని పునః ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. 1, 2, 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి యధావిధిగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్