విశాఖ: ఆడపిల్లల రక్షణలో కూటమి నిర్లక్ష్యం

54చూసినవారు
విశాఖ: ఆడపిల్లల రక్షణలో కూటమి నిర్లక్ష్యం
ఆడపిల్లల మాన, ప్రాణాల రక్షణలో కూటమి ప్రభుత్వం రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుసగా మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలు బతకాలా వద్దా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. శనివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం హోం మంత్రి ఉన్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్