సీతారాం ఏచూరి మృతి పట్ల ఎస్ఎఫ్ఐ యలమంచిలి డివిజన్ నాయకులు..మణికంఠ కేశవ శ్రీను ఆధ్వర్యంలో శుక్రవారం యలమంచిలి కళాశాలలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏచూరి తన ప్రజా జీవితాన్ని ఎస్ఎఫ్ఐలో చురుకైన నాయకుడిగా ప్రారంభించారనీ, ఢిల్లీలో తన కాలేజీ రోజులలో ఎస్ఎఫ్ఐలో సభ్యుడగా పని చేసి తదుపరి రాజకీయాలలో చురుకైన పాత్ర వహించి ఆంధ్రప్రదేశ్ నుంచి సిపిఎం జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారని అన్నారు.