అనంతపురం లో అక్షర్ పటేల్ అదరగొట్టారు. సీ టీమ్ పై జరుగుతున్న మ్యాచ్లో డీ టీమ్ తరఫున ఒంటరి పోరాటం చేశారు. 48/6తో జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అక్షర్ 118 బంతుల్లో 86 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో 48. 3 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. సీ టీమ్ బౌలర్లలో విజయ్ కుమార్ 3, హిమాన్షు, కాంబోజ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రికెట్ అభిమానులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.