విజయవాడ వరద ప్రాంతాల్లో జిల్లా పోలీసులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో పలు పోలీసు బృందాలు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాలైన అజిత్సాంగ్ నగర్, పాయకాపురం, భగత్సింగ్ నగర్, బాంబే కాలనీ, తదితర కాలనీల్లో పర్యటించి అక్కడ ముంపులో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేశారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు. కొందరికి మందులు పంపిణీ చేశారు.