అనంతపురం నగరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులతో కలిసి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి గొప్పతనాన్ని వివరించారు.