అనంతపురం జిల్లా కేంద్రంలోని టమాటా మార్కెట్లో కిలో టమాటాల ధర రూ. 25 పలుకుతున్నట్లు మార్కెట్ యార్డ్ ఎంపిక శ్రేణి అధికారులు గురువారం తెలిపారు. జిల్లా కేంద్రం సమీపంలోని కక్కలపల్లి క్రాస్ మండీలో బుధవారం కిలో టమాటా గరిష్ఠ ధర రూ. 25 పలికిందన్నారు. కనిష్ఠ రూ. 7, సరాసరి రూ. 17 ప్రకారం అమ్మకాలు జరిగాయన్నారు. టమాటా ధరలు తగ్గుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.