గుత్తి పట్టణం 22వ వార్డులోని పాత సీపీఐ కాలనీలో రోడ్డు మధ్యలో తాగునీటి బోరును మున్సిపాలిటీ అధికారులు గత నెలలో ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు మధ్యలో తాగునీటి బోరు అడ్డుగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క కాలనీలోకి ద్విచక్ర వాహనాలు, ఆటోలు రావాలని రావడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు స్పందించి తాగునీటి బోరును పక్కకు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు.