4000 లీటర్ల సారా ఊట ధ్వంసం - 20లీటర్ల నాటు సారా స్వాధీనం

1556చూసినవారు
కంబదూరు పోలీసు స్టేషన్ పరిధిలోని రాళ్లపల్లి గ్రామ పొలాల్లో ఉన్న నాటు సారా తయారీ స్థావరంపై ఆదివారం ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 4000 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. నాటు సారా తయారీదారులపై కేసు నమోదు చేశామని తెలిపారు. నాటు సారా పట్టుకున్న పోలీసులను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.

సంబంధిత పోస్ట్