కళ్యాణదుర్గం పట్టణం అంబెడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం విసికె పార్టీ నాయకులు పార్లమెంట్ లో అంబెడ్కర్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన అమిత్ షా విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ వారి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. మోదీకి అంబెడ్కర్ పట్ల చిత్తశుద్ధి ఉంటె ఆయనని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.