ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు కూడా అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనన్నారు.