ఎస్కేయూకు రూ. 31 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరు

594చూసినవారు
ఎస్కేయూకు రూ. 31 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి రూ. 31 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఈ నిధులను విడుదల చేశారు. వర్సిటీ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించడానికి వీలుగా బ్లాక్ గ్రాంట్ కేటాయిస్తారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జీతాల చెల్లింపునకు నిధులు విడుదల కావడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.