
మాజీ సీఎంను కలిసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తాడేపల్లిలోని వైసీపీ కార్యలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బుధవారం సాయంత్రం కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల గురించి జగన్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.