పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని నెహ్రూ యువ కేంద్ర సభ్యులు తెలియజేశారు. అనంతపురంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర సభ్యులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకోవాలని తెలిపారు.