అక్రమార్కుల నుంచి గుడిని కాపాడాలంటూ తప్పుడు ఆరోపణలు చేసిన పూజారి చెన్నకేశవుల పై గుడి కాపులు ఆదివారం మండిపడ్డారు. రాప్తాడు మండలం మరూరు చిన్న కదిరయ్య స్వామి దేవాలయం హుండీలో భక్తులు సమర్పించిన డబ్బులను ఆలయ పూజారి సొంత పనులకు వినియోగించుకున్నారని గుడి కాపులు నరేష్ శనివారం తెలిపారు. ఆగిన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే ఆలయ పూజారి అడ్డగిస్తున్నారని ఆయన ఆరోపించారు.