ఆత్మకూరులో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి స్థల పరిశీలన
ఆత్మకూరు మండలంలోని గోరిదిండ్ల, తోపుదుర్తి గ్రామాల్లో నూతన విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మించడానికి విద్యుత్ శాఖ అధికారులు స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు అధికారులు రెండు గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ ఈఈ మనోరమ మాట్లాడుతూ.. వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు రావడంతో నూతన ఉప కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.