రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం విద్యా శాఖ మంత్రి లోకేశ్ ను కలిశారు. రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయ అంశాలు తోపాటు ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, తాగునీరు వంటి సమస్యలపై చర్చించారు. త్వరలోనే రాప్తాడులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పరిటాల సునీత తెలిపారు.