ఆసుపత్రిలో సేవలు బంద్.. రోడ్లెక్కిన డాక్టర్లు

59చూసినవారు
కోల్కతాలో 31 ఏళ్ల మహిళా డాక్టర్ ను రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో శనివారం సూపరిండెంట్ మాధవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి నుండి వినాయక సర్కిల్ వరకు హంతకులను కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రాణం పోసే మాడాక్టర్ల పైనే ఇలాంటి ఘటనలు జరగడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్