యాడికి మండలంలోని వేములపాడు, యాడికి, రాయలచెరువు, తదితర గ్రామాల్లో మంగళవారం ముస్లిం. సోదరులు గ్యార్మీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాడికిలోని లాలాలవీధి, మెయిన్ బజార్, మహబూబ్ సుభాని జెండా కట్టల వద్ద రాయలచెరువు మహబూబ్ సుభాని జెండా కట్టల వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక పాతెహ, దరూద్ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి గంధంను గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.