ఈ నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరుగనున్న సిపిఐ 24 వ జాతీయ మహాసభలకు అనంతపురం అర్బన్ నియోజక వర్గ పరిధిలోని రుద్రం పేట గ్రామ పంచాయితీ చంద్రబాబు నగర్, సీపీఐ కాలని శాఖ నుండి ఆపార్టీ శ్రేణులు 25 వేల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నగర సహాయ కార్యదర్శి అల్లిపీర కు శాఖా కార్యదర్శి పెనకచర్ల బాలయ్య, కాశింబి, లక్ష్మి దేవి, స్వప్న తదితరులు విరాళం అందజేశారు.