పేదలైన ఎస్సీ, ఎస్టీలు ఇల్లు నిర్మించుకోవాలంటే అడ్డంకులు కల్పిస్తున్నారని న్యాయం చేయాలని హౌసింగ్ పీడీ శైలజని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కోరారు. శనివారం అనంతపురం జిల్లాలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంటి నిర్మాణ పనుల్లో దళిత, గిరిజనులకు జరుగుతున్న అడ్డంకులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు నిర్మాణానికి బిల్లులు, సామగ్రిని అందజేయాలన్నారు.