అందులు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందుల కోసం ఏర్పాటు చేసిన చదరంగం పోటీలను ప్రారంభించారు. అనంతరం లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.