పరగడుపున చాలామంది టీఫిన్‌కు బదులుగా పండ్ల రసం తాగుతుంటారు. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఖాళీ పొట్టతో జ్యూస్‌లు తాగడం వలన శరీరంలో చక్కర స్థాయిలు పెరుగుతాయని, ఇది క్రమంగా షుగర్ వ్యాధికి దారి తీస్తుందని చెబుతున్నారు. అలాగే పళ్లపై ఉండే ఎనామిల్ కూడా దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఆమ్ల తత్వం ఉన్న పండ్ల రసాలు తరచూ తీసుకోవడంతో జీర్ణశయ గోడలు దెబ్బతింటాయని చెబుతున్నారు.