ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీపీఎల్‌లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు ప్రభుత్వం అందించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 తేదీ నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా హైబ్రిడ్ బీమా విధానంలో వైద్య సేవలు అందిస్తాయన్నారు.