ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు పంపింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని, రెండు రోజులకు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.