వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వాఖ్యలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు శుక్రవారం కోరారు. అనంతపురం రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గిరిజమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామి రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు.