అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో గల గ్రామ సచివాలయంలో కల్లూరు పంచాయతీకి సంబంధించిన వాలంటీర్లకు కల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రభుదాసు ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రామ యువకుడు, ప్రైవేటు ఉపాధ్యాయుడు పాపన్న చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వాలంటీర్లకు శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, పెద్దలు పాల్గొన్నారు.