అనంతపురం అర్భన్ నియోజక వర్గంలోని తపోవనం కూడలి నుంచి సోమనాథ్ నగర్ మీదుగా నగరంలోకి వెళ్ళే ప్రధాన రహదారిని సోమవారం రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు.