అనంతపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జులు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పర్సన్స్ తో జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గాల సమస్యల పరిష్కారం కోసం చర్చించారు.