లేపాక్షి మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన కల్లూరు హరి, పి.చంద్రశేఖర్, బైరాపురం రవీంద్రారెడ్డి, అశ్వర్థ నారాయణలు కలిసి లేపాక్షి ఎస్సై సద్గురుడుకి శానిటైజర్లను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై సద్గురుడు మాట్లాడుతూ.. కొవిడ్ 19 నేపథ్యంలో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు. ఈ మేరకు కల్లూరు హరి, పి.చంద్రశేఖర్, బైరాపురం రవీంద్రారెడ్డిలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.