దేశ రక్షణకు నిరంతర సేవలు అందిస్తూ యుద్ధంలో మరణించిన, పదవి విరమణ గావించిన సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రూ. 70 వేల విలువగల సాయుధ దళాల పతాక స్టిక్కర్స్ మరియు కార్ గ్లాగ్స్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.