కల్లు గీత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు లింగమయ్య పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఎక్సైజ్ అధికారులను కల్లు గీత కార్మికులు బుధవారం మధ్యాహ్నం కలిశారు. కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని. గీత మొక్కలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.