సెంట్రల్ సిల్క్ బోర్డ్ బెంగుళూరు వారి ఆధ్వర్యంలో ధర్మవరంలో వున్న సిల్క్ బోర్డ్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు మగ్గం పై ఉపయోగించే దారం మరియు కెమికల్ నాణ్యత గూర్చి, చీరల మన్నిక గూర్చి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యత దారం మరియు చీరలు తయారీలో మెలుకువలు వివరించారు. పట్టణ చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్ అంతా హాజరయ్యారు.