ధర్మవరంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ నియోజకవర్గ కార్య దర్శి ముసుగు మధు మాట్లాడుతూ. పట్టణంలోని సర్వే నంబర్ 650-2లో గల ప్లంబర్లకు కేటాయించిన స్థలాలను అనర్హులకు తొలగించాలని తహశీల్దార్ నటరాజ్ను కలవడానికి వచ్చామన్నారు. ఆయన కలెక్టరేట్లో సమావేశానికి వెళ్లారని తెలిపారని, ఈ నెల 24 ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.