డీ. చెర్లోపల్లిలో పల్లె పండుగ కార్యక్రమం

61చూసినవారు
బత్తలపల్లి మండలం డీ. చెర్లోపల్లి గ్రామంలో సోమవారం "పల్లె పండుగ" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బత్తలపల్లి ఎంపీడీవో నరసింహనాయుడు, ఈ ఓ ఆర్ డి నరసింహప్ప ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు కొబ్బరికాయలు కొట్టి పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్