ధర్మవరం పట్టణాన్ని సుందరీ కరణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో కలిసి అమృత్ ఫేస్ వన్ ద్వారా మంజూరైన రూ.62 కోట్ల నిధులతో శానిటేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ నిధులతో ధర్మవరం పట్టణాన్ని సుందరీకరిస్తామన్నారు.