ధర్మవరంలోని ఎన్డీయే కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో మంత్రి సత్య కుమార్ ఆదివారం సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సక్రమంగా అందించాలని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు.