శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ప్రెస్ క్లబ్ కోసం కేటాయించిన మున్సిపల్ భవనాన్ని స్వాధీనపరచాలంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు జాప్ కమిటీ సభ్యులు వినతి పత్రం అందించారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కేటాయించిన భవనంపై కొందరు వ్యక్తులు ఆధిపత్యం చూపిస్తూ ఇతర పాత్రికేయులను అడ్డుకుంటున్నారనీ, సమస్య పరిష్కరించాలనీ వారు కోరారు.